మధ్యప్రదేశ్‌లో మూడేళ్లలో 31 వేల మంది మహిళలు మిస్సింగ్‌

మధ్యప్రదేశ్‌లో మూడేళ్లలో 31 వేల మంది మహిళలు మిస్సింగ్‌

న్యూ ఢిల్లీ: ఆడబిడ్డలు అదృశ్యమవుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. గడిచిన మూడేళ్లలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 31 వేల మందికిపైగా మహిళలు, బాలికలు మిస్సైనట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ హోం మంత్రి బాలా బచ్చన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ సమాచారం మేరకు.. రాష్ట్రంలో 2021 – 2024 మధ్య 31,000 మందికిపైగా మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారు. అందులో 28,857 మంది మహిళలు కాగా, 2,944 మంది బాలికలు ఉన్నారు. ఈ లెక్కన సగటున రోజుకు 28 మంది మహిళలు, ముగ్గురు బాలికలు అదృశ్యమవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.మిస్సైన వారి సంఖ్య వేలల్లో ఉన్నప్పటికీ.. అధికారికంగా 724 మిస్సింగ్ కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఉజ్జయినిలో గత 34 నెలలుగా 676 మంది మహిళలు అదృశ్యమైనప్పటికీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇక సాగర్ జిల్లాలో అత్యధికంగా 245 మంది బాలికలు తప్పిపోయారు. ఇండోర్ లో 2,384 మంది మహిళలు అదృశ్యమయ్యారు. రాష్ట్రంలో అదృశ్యమైన ఘటనల్లో ఇదే టాప్. ఇండోర్లో నెల రోజుల్లో 479 మంది మహిళలు అదృశ్యం కాగా, కేవలం 15 కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం. కాగా, 2019-21 మధ్య దేశవ్యాప్తంగా 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు కనిపించకుండా పోయారు. ఇందులో 1,98,414 మందితో బీజేపీపాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ తొలిస్థానంలో నిలిచింది.
మహిళల మిస్సింగ్ కేసుల్లో టాప్-5 రాష్ర్టాలు (2019-21)
రాష్ట్రం- కేసులు
మధ్యప్రదేశ్- 1,98,414
పశ్చిమబెంగాల్- 1,93,511
మహారాష్ట్ర -1,91,433
ఒడిశా -86,871
ఛత్తీస్గఢ్- 59,933

తాజా సమాచారం

Latest Posts

Featured Videos