తిరువనంతపురం: అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లిన 10 మంది మహిళా భక్తులను పంబ నుంచి వెనక్కి పంపేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారి వయస్సు 10-50 ఏళ్లని అధికార్లు తెలిపారు. అయ్యప్ప స్వామి మండల పూజోత్సవం కోసం ఆలయం తలుపులను తెరవనున్న కొద్దిసేపటికి ముందే వారికీ చేదు అనుభవం ఎదురైంది. ఆలయం తెరవనున్నందున ఆలయం చుట్టూ 10,000 మందికి పైగా పోలీసు సిబ్బంది మోహరించారు. 2018 మాదిరిగా నిషేధ ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని పదనం తిట్ట కలెక్టర్ తెలిపారు. నిరుడు మహిళా భక్తులకు కేరళ పోలీసులు భద్రత కల్పించగా తాము ఈ సారి భద్రత కల్పించలేమని కేరళ ప్రభుత్వం తేల్చి చెప్పింది.