ప్రేమ పేరుతో సామూహిక అత్యాచారం..

ప్రేమ పేరుతో సామూహిక అత్యాచారం..

ప్రేమ పేరుతో యువతిని మాయమాటలతో నమ్మించి ఆరు మంది స్నేహితులతో కలసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది.నిజామాబాద్‌ పట్టణ శివార్లలో ఉంటున్న పేద కుటుంబానికి చెందిన యువతి అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో పని చేస్తూ కుటుంబానికి అండగా ఉంటోంది.ఇంటి నుంచి ఫ్యాక్టరీకి వెళ్లడానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రతిరోజూ ఆటోలో వెళ్లి వస్తుండేది.ఈ క్రమంలో ఆటో డ్రైవర్‌ నరేశ్‌తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది.ఇది వరకే పెళ్లై పిల్లలున్న విషయాన్ని దాచిన నరేశ్‌ యువతితో ప్రేమాయణం నడిపాడు.శుక్రవారం మధ్యాహ్నం సినిమాకు వెళదామని యువతిని ఆటోలో అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అక్కడితో ఆగకుండా.. మరో ఆరు మంది స్నేహితులను పిలిపించి వారితో కూడా అత్యాచారం చేయించాడు.ఈ విషయాన్ని యువతి బయటపెట్టకుండా ఉండేందుకు జరిగిందంతా వీడియో తీశారు.ఎవరికైనా చెబితే వీడియో బయటపెడతామంటూ బెదిరించి వెళ్లిపోయారు. వారిలో ఇద్దరు యువకులు ఫోన్‌లో వీడియోలు చూస్తుండగా అటుగా వెళ్తున్న పోలీసులు ఇద్దరు యువకులను ఆపి తమదైన శైలిలో ప్రశ్నించగా విషయం వెలుగులోకి వచ్చింది.బాధితురాలిని కలిసి యువతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos