కేవలం టాలీవుడ్ బాహుబలి మాత్రమే కాదండోయ్ హాలీవుడ్ బాహుబలి కూడా శివుడిని పూజించాడు.లయకారుడైన పరమశివుడికి ఏ ఉడ్ స్టారైనా దాసోహమవాల్సిందే.అందుకు హాలీవుడ్ సూపర్‌స్టార్ విల్‌స్మిత్ ఇండియాకు వచ్చి శివలింగానికి పూజలు చేశాడు.మహాశివరాత్రి పర్వదినాన ప్రయాగలో జరుగుతున్న కుంభమేళాకు వచ్చిన విల్ స్మిత్ శివలింగాన్ని గంగా జలంతో శుచి చేసి అటుపై హారతి ఇచ్చి నిష్టగా పూజలు చేశాడు. విల్‌స్మిత్ శివుడికి పూజలు చేస్తుంటే చూడడానికి కన్నుల పండుగలా కనిపించింది.అందుకే శివలింగాన్ని భుజస్కందాలపై మోసినందుకు ప్రభాస్‌ను టాలీవుడ్ బాహుబలిగా పిలుచుకుంటుంటే శివలింగాన్ని పాలతో అభిషేకించిన విల్‌స్మిత్‌ను హాలీవుడ్ బాహుబలిగా అభివర్ణించాం.