శంకర్‌ రాజీ పడతాడా??

  • In Film
  • February 19, 2019
  • 182 Views
శంకర్‌ రాజీ పడతాడా??

ఇప్పటి వరకు
రాజీ అనే పదానికి తావివ్వకుండా సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా ఖ్యాతి గడించిన దర్శకుడు
శంకర్‌ భారతీయుడు-2 కోసం రాజీ పడాల్సిన పరిస్థితులు తలెత్తాయని తమిళ చిత్రవర్గాల్లో
జోరుగా చర్చలు సాగుతున్నాయి.బాహుబలిని మించిన చిత్రాన్ని తీయాలనే పట్టుదలతో రూ.550
కోట్ల భారీ వ్యయంతో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో విజువల్‌ గ్రాండియర్‌గా తెరకెక్కించిన
రోబో 2.0 సుమారు రూ.100 కోట్లమేర నష్టాల్ని మిగిల్చినట్లు సమాచారం.దీంతో రోబో 2.0 నిర్మించిన
లైకా ప్రొడక్షన్‌ సంస్థ తదుపరి చిత్రమైన భారతీయుడు-2ను నిర్దేశించిన బడ్జెట్‌లోపు పూర్తి
చేసివ్వాలంటూ అగ్రిమెంట్‌ చేయాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.భారతీయుడు-2కు సుమారు
రూ.200 కోట్ల వ్యయమవుతుందని శంకర్‌ తెలపగా అందుకు అంగీరించిన లైకా ప్రొడక్షన్స్‌ గతంలో
మాదిరి కాకుండా రూ.250 కోట్ల లోపు చిత్రాన్ని రెడీ చేసి ఇవ్వాలని అందుకు సంబంధించి
అగ్రిమెంట్‌ ఇవ్వాలంటూ ప్రతిపాదన ముందించినట్లు తెలుస్తోంది.అయితే చిత్రాన్ని అంతలోపే
తీయాలని పరిమితులు విధించడం తగదని బడ్జెట్‌ పెరిగితే నేనేం చేయగలనంటూ తెలిపి అగ్రిమెంట్‌
ఇవ్వడానికి నిరాకరించినట్లు సమాచారం.ఇది జరిగిన అనంతరం లైకా వారితో కాకుండా మరో నిర్మాణ సంస్థతో భారతీయుడు 2 చిత్రాన్ని తీయాలనే శంకర్ భావిస్తున్నాడట. ఇప్పటికే పలువురు నిర్మాతలతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. గతంలో ఈ చిత్రంపై ఆసక్తి చూపించిన దిల్ రాజుతో కూడా చర్చలు జరిగాయట. ఎవరైనా కూడా 150 నుండి 200 కోట్ల వరకు పెట్టగలం అని మాత్రమే చెబుతున్నారట. దాంతో 250 కోట్ల బడ్జెట్ పెడతామన్న లైకా వారితోనే ఈ సినిమా చేసేందుకు శంకర్ అగ్రిమెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్ విషయంలో శంకర్ రాజీ పడేందుకు అస్సలు ఇష్టపడడు. మరి భారతీయుడు 2 చిత్రంకు రాజీ పడకు తప్పని పరిస్థితి ఎదురైంది. మరి ఈ సమయంలో శంకర్ ఏ చేస్తాడనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos