సీజన్ మారాకా తిరిగి అధికారంలోకి వస్తాం..

సీజన్ మారాకా తిరిగి అధికారంలోకి వస్తాం..

నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం మధ్యాహ్నం ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఫడ్నవీస్ భార్య అమృత కవిత రూపంలో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు చెప్పారు. మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టారు. ఇది శరధ్రుతువని త్వరలోనే వసంతం వస్తుందని, సువాసనలు తిరిగి వస్తాయని, వాతావరణంలో మార్పు కోసం తాను ఎదురు చూస్తుంటానని అన్నారు. గత ఐదేళ్లుగా మహారాష్ట్ర ప్రజలు తనపై ఎంతో ప్రేమను చూపారని, దాన్ని మరువలేనని అన్నారు. తన శక్తికొద్దీ, ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కృషి చేశానని అన్నారు. కాగా, నిన్న సాయంత్రం బలపరీక్షను ఎదుర్కోవాల్సివున్న తరుణంలో, గెలుపు సాధ్యం కాదని భావించిన ఫడ్నవీస్, రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos