అలియా కోసం రాజమౌళి తీవ్ర ప్రయత్నం..

  • In Film
  • March 7, 2019
  • 184 Views
అలియా కోసం రాజమౌళి తీవ్ర ప్రయత్నం..

రామ్‌చరణ్‌,ఎన్టీఆర్‌
క్రేజీ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న
ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో కథానాయికల కోసం రాజమౌళి వేట ముమ్మరం చేశారు.రాజమౌళి చిత్రంలో
అందులోనూ ఇంతటి భారీ చిత్రంలో నటించడానికి ఏ హీరోయినైనా ఒప్పుకొన్న చిత్రాలను సైతం
పక్కన పెట్టేసి మరీ సినిమాలో నటించడానికి అంగీకరిస్తారు.అటువంటి రాజమౌళి మాత్రం బాలీవుట్‌
నటీమణుల కోసమే తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.అందులోనూ యువ హీరోయిన్‌ అలియాభట్‌ను
ఎలాగైనా ఈ చిత్రంలో నటింపచేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న రాజమౌళి అందుకోసం తన స్నేహితుడు,దర్శకనిర్మాత
కరణ్‌ జోహార్‌ను రంగంలోకి దించినట్లు సమాచారం.అయినప్పటికీ అలియా నుంచి ఎటువంటి స్పందన
రావడం లేదని టాక్‌.రాజీ విజయం అనంతరం అలియా మరికొన్ని భారీ చిత్రాల్లో నటించడానికి
సైన్‌ చేసేయడంతో ఈ భారీ చిత్రంలో నటించడానికి అంగీకరించడం లేదని సమాచారం.మొదటి హీరోయిన్‌
పాత్ర ప్రవేశించడానికి సమయం ఆసన్నమవడంతో ఎలాగైనా అలియాను ఒప్పించాలంటూ రాజమౌళి కరణ్‌పై
ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం.రెండవ హీరోయిన్‌ ఎంట్రీకి మరి కొద్ది నెలలు సమయం ఉండడంతో
అప్పటికి పరిస్థితులకు తగ్గట్టు మరో హీరోయిన్‌ను ఎంపిక చేసుకోవచ్చని రాజమౌళి భావిస్తున్నట్లు
సమాచారం.అయినా ఇంతటి భారీ చిత్రంలో నటించడానికి ఏమాత్రం ఆసక్తి చూపని బాలీవుడ్‌ ‘నటీమణుల’
పై మన దర్శకధీరుడు ఎందుకు అంత పట్టుదలగా ఉన్నాడో ఎవరికీ అంతుపట్టడం లేదు.అయితే ఇవన్నీ
కేవలం ఊహాగానాలు మాత్రమే.రాజమౌళి నోరు విప్పేంత వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంపై వస్తున్న
ఇటువంటి ఊహాగానాలు వింటూ ఉండడం తప్ప చేసేదేమి లేదు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos