సమాజంలో రోజురోజుకు అనైతిక సంబంధాలు,వాటివల్ల నేరాలు పెరుగుతూనే ఉన్నాయి.అక్రమ సంబంధాల వల్ల ప్రతిరోజు హత్యలు,ఆత్మహత్యలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి.తాజాగా పశ్చిమ బెంగాల్,బీహార్ రాష్ట్రాల్లో జరిగిన రెండు ఘటనలు అనైతిక సంబంధాల వల్ల కలిగే దుష్పరిణామాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి.భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భార్యను హత్య చేయగా మరొక ఘటనలో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హస్నాబాద్ ప్రాంతానికి చెందిన సాదన్,దీపాలి భార్యాభర్తలు.కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న సాదన్ వ్యాపారం కోసం ఎక్కువగా బయటే గడిపేవాడు.దీంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న భార్య దీపాలి పక్కింటి యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.ఇదే విషయాన్ని కొంతమంది యువకులు చెప్పిన నమ్మని సాదన్ ఇరుగుపొరుగు వ్యక్తులు చెప్పడంతో నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు.ఒక రోజు పక్కింటి యువకుడితో బయటకు వెళ్లిన దీపాలి అర్ధరాత్రి ఇంటికి చేరుకుంది.అప్పటికే ఇంటికి చేరుకున్న సాదన్ నిలదీయడంతో నిన్ను చూస్తే నాకు బోర్ కొడుతోంది. పక్కింటి వాడు అందంగా ఉన్నాడు. నన్ను ఎంజాయ్ చేయని అంది.అంతే ఆవేశం పట్టలేక కత్తితో భార్యను నరికేసి నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.ఇక బీహార్లో జరిగిన మరొక ఘటనలో భార్య చేసిన పనికి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.బీహార్ అరారియాలోని సిమ్రాహ్ ప్రాంతమది. ఆ ప్రాంతంలో హేమంత్ గుప్త, మున్నీదేవిలు నివాసముంటున్నారు. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేసేశారు. ప్రస్తుతం వీరిద్దరే కలిసి ఉంటున్నారు. కొడుకు, కూతురు ఇద్దరూ వేర్వేరు కాపురం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.గత సంవత్సరం నుంచి మున్నీదేవిలో మార్పు గమనించాడు హేమంత్. ఆమెను హెచ్చరించాడు. మనకు ఈ వయస్సులో కావాల్సింది ఒకరికొకరి తోడు. అర్థం చేసుకో అని చెప్పాడు. భార్య వేరే యువకుడితో కలుస్తోందని తెలిసిన ఆ వృద్ధుడు ఆమె తోడునే కోరుకున్నాడు.దీన్నే అదునుగా భావించింది మున్నీదేవి. తన ఇంటికి పక్కనే ఉన్న రాకేష్‌తో జరుపుతున్న వివాహేతర సంబంధం కాస్తా పెళ్ళి వరకు తీసుకెళ్ళింది. శనివారం ఏకంగా రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి వచ్చింది. నేరుగా రాకేష్ ఇంటికే వెళ్ళిపోయింది.విషయం తెలుసుకున్న హేమంత్ ఆవేదనకు గురయ్యాడు. భార్య లేని జీవితం వ్యర్థం అనుకున్నాడు. ఫేస్ బుక్‌లో లైవ్ పెట్టి తన ఆవేదనను వివరిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితులు ఇంటికి వచ్చేలోపే అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఆసుపత్రికి తీసుకువెళ్ళేలోపే చనిపోయాడు. ప్రస్తుతం పెళ్ళి చేసుకున్న మున్నీదేవి, రాకేష్‌లు మాత్రం పరారీలో ఉన్నారు.