నీతులు ప్రజలకేనా కేసీఆర్‌?

నీతులు ప్రజలకేనా కేసీఆర్‌?

ప్రజలకు హితబోధ చేస్తూ నలుగురికీ ఆదర్శంగా నిలవాల్సిన నేతలు తమ బాధ్యతను విస్మరిస్తే ఇన్నాళ్లు సదరు నేతలు చెప్పిన నీతి వ్యాక్యాలకు,చేసిన హితబోధలకు విలువేముంది.బాధ్యతలు నిర్లక్ష్యం చేసిన నేతలపై ప్రజలకు ఏం గౌరవం ఉంటుంది.విషయానికి వస్తే ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కు ఆయుధాన్ని ఉపయోగించాలని ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతీ పౌరుడి బాధ్యతంటూ తెగ ఉపన్యాసాలు ఇచ్చిన సీఎం కేసీఆర్ తనే ఆ బాధ్యతను నిర్లక్ష్యం చేశారు.లోక్సభ ఎన్నికల్లో సొంతూరు చింతమడక గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్ మండల పరిషత్ ఎన్నికల్లో మాత్రం ఓటు వేయకుండా రాజకీయ పర్యటనల్లో బిజీ అయ్యారు.ఇదే అంశాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు హైలైట్ చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.ప్రజలకు హితబోధలు చేస్తూ నీతులు వల్లించే సీఎం కేసీఆర్ తాను మాత్రం నీతులు పాటించడని ఒక సీఎంకే ఓటు వేయాలనే పట్టింపు లేనపుడు ప్రజలకు ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.కాంగ్రెస్ నేతలకు తెరాస నేతలు స్పందిస్తూ ఫెడరల్ ఫ్రంట్ చర్చల కోసం సీఎం కేసీఆర్ కేరళ సీఎం పినరయ్ విజయన్తో సమావేశవడానికి వెళ్లారని అందుకే ఓటు హక్కు వినియోగించుకోవడం కుదరలేదంటూ బదులిచ్చారు.తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రజల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలను నిర్లక్ష్యం చేస్తారా అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos