పాత అనుష్కను చూడడం ఇక కష్టమే..

  • In Film
  • March 11, 2019
  • 157 Views
పాత అనుష్కను చూడడం ఇక కష్టమే..

బాహుబలి ముందు వరకు గ్లామర్‌ రోల్స్‌ చేస్తూ కేవలం టాలీవుడ్‌కు
మాత్రమే పరిమితమైన అనుష్క శెట్టి బాహుబలి విడుదలైన అనంతరం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
తెచ్చుకుంది.అయితే బాహుబలితో గుర్తింపు తెచ్చుకున్నందన్న మాటేకానీ ఆ గుర్తింపు వల్ల
అనుష్కకు ఒరిగిందేమి లేదు.బాహుబలి సమయంలోనే చేసిన సైజ్‌జీరో సినిమా వల్ల విపరీతమైన
బరువు పెరగడంతో బాహుబలి విడుదలై రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా
కనిపించలేదు.కొద్ది రోజుల క్రితం లేడి ఒరియంటెడ్‌ కథాంశంతో తెరకెక్కనున్న ఓ తెలుగు
చిత్రంలో నటించడానికి అనుష్క అంగీకరించగా అందులో మాధవన్‌ ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్లు
వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా కాకుండా మరొక సినిమాకు కూడా అనుష్క ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.అయ్యప్పపై
విభిన్న కథాంశంతో తెరకెక్కించనున్న ఈ చిత్రం తెలుగు,తమిళం,మలయాళం,కన్నడ,హిందీ భాషల్లో
కూడా విడుదల కానున్నట్లు సమాచారం.అనుష్క అభిమానులు మళ్లీ గ్లామర్ గా ఆమెను చూడాలని కోరుకుంటూ ఉంటే ఆమె మాత్రం ఇలాంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కమిట్ మెంట్ ఇస్తూ వస్తుంది. ప్రస్తుతం  అనుష్క ఉన్న పరిస్థితుల్లో ఆమెతో నటించేందుకు ఏ స్టార్ హీరో కూడా ఆసక్తి చూపడం లేదు. అందుకే ఆమె ఇకపై ఇలాంటి సినిమాలకే పరిమితం అవ్వాల్సిందే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos