కరోనా కాటుకు 30 లక్షల మంది బలి

కరోనా కాటుకు 30 లక్షల మంది బలి

జెనీవా: ఏడాది ప్రపంచ వ్యాప్తంగా నిరుడు 30 లక్షల మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 18 లక్షల మంది మాత్రమే చనిపోయారని దేశాల గణాంకాలు తెలుపు తున్నాయి. ఆయా దేశాలు వెల్లడించిన గణాంకాల కంటే 12 లక్షల మరణాలు అధికంగా సంభవించి ఉండవచ్చని పేర్కొంది. గత ఏడాది డిసెంబరు 31 నాటికి ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 8.2 కోట్లని ఆయా దేశాలు తెలిపాయి. కరోనా సోకి చికిత్స పొందుతూ మరణించినవారితో పాటు పాజిటివ్గా వచ్చి ఇళ్లలో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి గణాంకాలనే ప్రపంచ దేశాలు నమోదు చేశాయని తెలిపింది. కరోనా నిర్ధారణ సరిగా జరగకముందే మృతి చెందిన వారు చాలా మంది ఉన్నారు. ఆ మృతుల సంఖ్యను లెక్కల్లోకి తీసుకోలేదని వివరించింది. కరోనా సోకవడం వల్ల మాత్రమే కాకుండా ఆ సంక్షోభం కారణంగా తలెత్తిన పరిణామాల వల్ల కూడా చాలా మంది మృతి చెందారని వివరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos