జెనీవా : కరోనా టీకా వచ్చినా దాని ముప్పు పూర్తిగా పోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్ నిపుణుడు మైక్ రియాన్ వ్యాఖ్యానించారు . కరోనా మనతోపాటే ఉంటుంది. దానితో సహజీవనం తప్పదని చెప్పారు. కరోనా కట్టడికి ప్రపంచం మొత్తం విశేష కృషి చేయాల న్నారు. టీకాల వల్ల కొత్త రోగాలు వచ్చే అవకాశముందని ఆందోళన చెందారు. హెచ్ఐవి లాగానే మనతోపాటే ఎక్కువ కాలం కొనసాగుతుందన్నారు. దీని నియంత్రణకు అందరూ పరస్పర సహకారంతో పనిచేయడమే పరిష్కారమని రియాన్ అభిప్రాయపడ్డారు.