సింధు కంటే ఒకరోజు ముందే..

  • In Sports
  • August 29, 2019
  • 209 Views
సింధు కంటే ఒకరోజు ముందే..

బ్యాడ్మింటన్‌లో ప్రపంచ విజేతగా నిలిచిన పీవీ సింధుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.ఒకరితో పోటీ పడి మరొకరు సింధుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ప్రధాని నరేంద్రమోదీ సైతం తన కార్యాలయంలో పీవీ సింధును ఆమె కోచ్‌ను అభినందించారు.అయితే సింధు కంటే ఒకరోజు ముందే ఇదే బ్యాడ్మింటన్‌లో ప్రపంచ విజేతగా నిలిచిన క్రీడాకారాణిని మాత్రం ఎవరూ గుర్తించకపోవడం విచారకరం.కనీసం ఆమె గురించి ఎక్కడా చిన్న వార్త కూడా లేకపోవడం బాధాకరం.పీవీ సింధు కంటే ఒకరోజు ముందు మానసి జోషి అనే క్రీడాకారాణి పారా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌లో స్వర్ణ పతకం సాధించి పారా బ్యాడ్మింటన్‌లో ప్రపంచ విజేతగా నిలిచారు.బ్యాడ్మింటన్‌ శిక్షణ తీసుకుంటున్న సమయంలో 2011లో రోడ్డు ప్రమాదం వల్ల ఎడమకాలును కోల్పోయిన మానసి కృత్రిమ కాలుతోనే బ్యాడ్మింటన్‌లో నైపుణ్యం సాధించి కోర్టులోకి దిగారు.దీంతోపాటు స్కోబా డైవింగ్లో కూడా మెళకువలు నేర్చుకున్నారు.2014లో పారా ఏషియన్ గేమ్స్తో అంతర్జాతీయ క్రీడల్లోకి ప్రవేశించి ఛాంపియన్గా ఎదిగి అదే ఆత్మవిశ్వాసంతో ఆటను కొనసాగించి పారా బ్యాడ్మింటన్ బంగారు పతకం సాధించి ప్రపంచ విజేతగా నిలిచారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos