న్యూ ఢిల్లీ: భారతీయ ఖాతాలపై వాట్సాప్ కొరడా ఝుళిపించింది. మే 15 నుంచి జూన్ 15 మధ్య ఏకంగా 20 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించింది. నూతన ఐటి నిబంధ నలకు అనుగుణంగా ఈ కఠినచర్యలు తీసుకున్నట్లు వివరించింది. వాట్సాప్కు 50 లక్షల మంది ఫేస్బుక్ యూజర్లు ఉన్నారు. కొత్త ఐటి చట్ట ప్రకారం సోషల్ మీడి యా యాప్ లు ప్రతి నెల కేంద్రానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. తన నెలవారీ నివేదికలో వాట్సాప్ ఏకంగా 20 లక్షల భారతీయుల ఖాతాలను బ్యాన్ చేసినట్లు కేంద్రానికి సమర్పించింది.