ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం సాహో ఫీవర్‌తో ఊగిపోతోంది.ఆన్‌లైన్‌లో సాహో టికెట్లు క్షణాల్లో అమ్మడవుతున్నాయి.సాహో విడుదల నేపథ్యంలో ప్రభాస్ అభిమానులైతే భారీ కటౌట్లు,టపాసులు ఇలా చాలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఈ క్రమంలో ప్రభాస్‌కు బీభత్సమైన అభిమానులు ఉన్న పశ్చిమగోదావరి జిల్లా బీమవరం పట్టణమైతే పూర్తిగా సాహో మయమైంది.పట్టణంలో రోడ్లకు ఇరువైపులా సాహో పోస్టర్లు అతికించారు. భీమవరం పట్టణమే కాదు చుట్టుపక్కల ఉండే పల్లెల్లో కూడా ప్రభాస్ పోస్టర్ల హంగామా ఉందంటే జనాలు సాహో ఫీవర్ తో ఎలా ఊగిపోతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కొందరు నెటిజన్లు ఈ హంగామా చూసి ‘ఇది భీమవరం కాదు సాహోవరం‘ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.
Longest flex ever… #Prabhas #Bhimavaram #Saaho #SaahoFromTomorrow 🕺 #SaahoFDFS 💥 pic.twitter.com/kc9uwicjhB
— Saaho 😎 (@MSKumar143) August 28, 2019