అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మరో 47 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ శనివారం ఇక్కడ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2561కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1778కి, మృతుల సంఖ్య 56కు చేరింది. ప్రస్తుతం 727 కరోనా పీడితు లున్నారు.