ఇలా అయితే కష్టమే..

  • In Film
  • July 6, 2019
  • 143 Views
ఇలా అయితే కష్టమే..

ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన చిత్రం విడుదల తేదీ సమీపిస్తుందంటే చిత్ర బృందం మొత్తం ఒకరకమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు.ముఖ్యంగా దర్శకుడు,నిర్మాతలైతే నెల రోజుల ముందు నుంచే చిత్రం ప్రమోషన్లను ఒక రేంజులో ప్లాన్‌ చేస్తారు.అటువంటిది దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రమంటే దర్శకనిర్మాతలకు ఇంకెంత ఒత్తిడి ఉండాలి.కానీ సాహో చిత్ర దర్శక నిర్మాతల్లో అటువంటి లక్షణాలు ఇసుమంతైనా కనిపించడం లేదు.ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గురించి యువి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడంలేదు.ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించడం కోసం బాలీవుడ్, హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకొచ్చారు. ప్రచారం కోసం కూడా బాలీవుడ్ యూనిట్ మీద ఆధారపడ్డారు. వారు ఫాలో అయ్యే స్ట్రాటజీలనే ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. అయితే అది తెలుగు ప్రేక్షకులకు చేరుతున్నట్లు కనిపించడం లేదు.టీజర్ రిలీజ్ చేసిన రోజు రెండు రోజులు హడావిడి నడిచింది. ఆ తరువాత మళ్లీ ఏం లేదు.ఇప్పుడు మళ్లీ పాట రిలీజ్ అన్నారు. దానికి సంబంధించిన టీజర్ తెలుగు వారికి పెద్దగా కనెక్ట్ అయినట్లు లేదు. కేవలం సినిమా టైటిల్, ప్రభాస్, భారీతనం మీద సినిమాకు ఓపెనింగ్స్ వస్తాయేమో కానీ లాంగ్ రన్ అది కష్టమవుతుంది.హిందీ మార్కెట్‌పై మోజుతో తెలుగును నిర్లక్షం చేస్తే సాహో చిత్రం దర్శక నిర్మాతలకు ఓ పీడకలగా మిగిలిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.ఇప్పటికైనా మేల్కొని తెలుగు ప్రచారాలపై దృష్టి సారించడం మంచిది ముఖ్యంగా హీరో ప్రభాస్‌,దర్శకుడు సుజీత్‌లకు.ఎందుకంటే తనకు ఇంతటి స్థాయిలో గుర్తింపు దక్కడానికి తెలుగు చిత్రం, తెలుగు ప్రేక్షకులేనన్న విషయాన్ని ప్రభాస్‌ మరచిపోరాదు.అదే విధంగా దర్శకుడు సుజీత్‌ కూడా సాహో చిత్రం అనంతరం సుజీత్‌కు అవకాశాలు ఇచ్చేది తెలుగు చిత్రపరిశ్రమేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos