విశ్వాస తీర్మానానికి హాజరయ్యే ప్రసక్తే లేదు..

విశ్వాస తీర్మానానికి హాజరయ్యే ప్రసక్తే లేదు..

 సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పుతో కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల రాజీనామాలపై సభాపతిదే తుది నిర్ణయమని తెలుపుతూనే గురువారం బలపరీక్ష నిరూపించుకోవాలని అయితే బలపరీక్షకు హాజరు కావాలో లేదో ఎమ్మెల్యేల ఇష్టమని వెల్లడించింది.దీంతో గురువారం విధానసౌధలో సీఎం కుమారస్వామి ప్రవేశపెట్టనున్న విశ్వాస తీర్మానంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.అసంతృప్త ఎమ్మెల్యేలు మాత్రం బలపరీక్షకు ఎట్టిపరిస్థితుల్లోనూ హాజరు కామంటూ స్పష్టం చేశారు.సుప్రీం కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని న్యాయస్థానం మీద పూర్తి నమ్మకం ఉందని, తాము ఊహించినట్లే తీర్పు వచ్చిందని, సుప్రీం కోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని రెబల్ ఎమ్మెల్యేలు చెప్పారు. శాసన సభ సమావేశాలకు హాజరు కావాలా ?, వద్దా ? అనే నిర్ణయం రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలకు ఉందని సుప్రీం కోర్టు చెప్పింద ఈ నేపథ్యంలో గురువారం జరిగే శాసన సభ సమావేశాలకు తాము హాజరు కాకూడదని నిర్ణయించామని రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు, మాజీ మంత్రి హెచ్. విశ్వనాథ్ మీడియాకు  చెప్పారు.అయితే ముంబైకి వెళ్లకుండా బెంగళూరులో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు రామలింగా రెడ్డి, ఆనంద్ సింగ్, డాక్టర్ కే. సుధాకర్ గురువారం శాసన సభ సమావేశాలకు హాజరౌతారా ? లేదా ? అనే విషయం వేచిచూడాలి. శాసన సభ సమావేశాలకు హాజరుకావాలని రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తీసుకురాకూడదని, విప్ జారీ చెయ్యకూడదని సుప్రీం కోర్టు మద్యంతర ఆదేశాలు జారీ చేసింది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos