వ్యాపకమో లేక వ్యాపారమో తెలియదు కానీ ఓ వ్యక్తి ఇంటికి సమీపంలోనున్న చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు.చేపల కోసం గాలం వేసి చాలా సేపు ఎదురు చూశాక చేప గేలానికి తగులుకోవడంతో గబగబా పైకి లాగాడు.అయితే గాలానికి చేపతో పాటు వచ్చిన భారీ సర్పాన్ని చూసి వ్యక్తికి కాసేపు కాళ్లకింద భూమి కంపించిపోయింది.గాలానికి చిక్కిన చేపను చుట్టుకొని తినడానికి సిద్ధంగా ఉన్న భయంకరమైన పామును చూసి మొదటి భయపడ్డా తర్వాత తేరుకొని వెంటనే ఆ ఘటనను తన కెమేరాలో బంధించాడు.పాము బందిలో చేప ప్రాణాలతో కొట్టుకుంటోంది.పాము బందీలో చేప… ఆ వ్యక్తి బంధీలో పాము ఇంచు మించు రెండూ ప్రాణాల కోసం కొట్టుకుంటున్నట్లే ఉంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.గంటల వ్యవధిలో ఆ వీడియోల్లో లక్షల్లో వీక్షించగా 50వేల మందికిపైగా కామెంట్స్ చేశారు..
The things I go through with bayou fishing 😂😂🎣🐍 pic.twitter.com/5E5qqg6Ira
— TEXAS WILD BOY🎣🐍 (@ChaseThePlayBoy) July 8, 2019