పులిపిర్లకు ఇంటి వైద్యం

పులిపిర్లకు ఇంటి వైద్యం

పులిపిర్లు చాలా మందిలో అసహనాన్ని పెంచుతూ ఉంటాయి. ఇవి దాదాపు ప్రతి ఒక్కరిలోనూ కనబడుతూ ఉంటాయి. హ్యూమన్‌ పాపిలోమా అనే వైరస్‌ వల్ల ఇవి ఏర్పడతాయి. మెడ చుట్టూ, చేతులపై, చంకల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొంత మంది జననాంగాలపై కూడా దర్శనమిస్తుంటాయి. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినా, రోగ నిరోధక శక్తి లోపించినా కొన్ని రకాల వైరస్‌లు శరీరంపై దాడి చేస్తాయి. దీనివల్ల పులిపిర్లు ఏర్పడతాయి. వీటిని కత్తిరించడం లేదా కాల్చడం చేయకూడదు. ఇంటిలోనే అయిదు చిట్కాలతో వీటిని తొలగించుకోవచ్చు.

        కలబందలో
ఉండే మేలిక్‌ యాసిడ్‌ పులిపిర్ల పులిపిర్లలోని ఇన్ఫెక్షన్‌తో పోరాడుతుంది. కనుక కలబంద
మధ్యలో ఉండే జిగురును తీసుకుని పులిపిర్లపై రాస్తే తొలగిపోతాయి.

        ఆముదంలో
కాస్త బేకింగ్‌ పౌడర్‌ వేసి బాగా కలపాలి. దానిని పులిపిర్లపై పూసుకుని కట్టు కట్టుకోవాలి.
రాత్రంతా కట్టుతోనే ఉండాలి. ఇలా చేస్తే రెండు, మూడు రోజులకే అవి తొలగిపోతాయి.

        అరటి  పండు తొక్కతో రోజూ పులిపిర్లపై రుద్దితే అవి క్రమేణా
కనుమరుగవుతాయి.

        వెల్లుల్లిని
ముద్దగా చేసుకుని పులిపిర్లు ఉన్న చోట రాస్తే, క్రమేణా నిర్మూలించబడతాయి.

        యాపిల్‌
సిడర్‌ వెనిగర్‌లో అధిక యాసిడ్‌ కంటెంట్‌ ఉంటుంది. వారంలో కనీసం అయిదు రోజులు దూదిని
వెనిగర్‌లో పులిపిర్లు ఉన్న చోట రాసుకుంటే పూర్తిగా తొలగిపోతాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos