నేతలకు క్లాస్‌ పీకిన గులాబీ బాస్‌..

నేతలకు క్లాస్‌ పీకిన గులాబీ బాస్‌..

లోక్‌సభ ఎన్నికలకు సమయం తరముకొస్తుండడంతో తెలంగాణలో అన్ని స్థానాల్లో విజయపతాకం ఎగురవేయాలనే ఆతృతతో తెరాస నేతలు ఎన్నికల ప్రచారాల్లో నోటీ దురుసు ప్రదర్శించిన విషయం తెలిసిందే.మీరు ఎవరికి ఓటు వేసినా తిరిగి వారంతా తెరాసలోకే వస్తారని,తెరాస నేతలకు మినహా ఎవరికి ఓట్లు వేసినా మీ ఓట్లు మురుగుకాలవలోనే పడతాయని అవాకులు చవాలకు పేలారు. అంతటితో ఆగకుండా మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకరరావు మీ రుణాలు,మీ పింఛన్లు మంజూరు చేసేది నేనేనని తెరాసకు ఓట్లు వేయకుంటే మీకు రావాల్సినవి ఒక్కటి కూడా రావంటూ బెదిరించారు. శాసనసభ ఎన్నికల్లో చేసిన తప్పును లోక్‌సభ ఎన్నికల్లో సరిదిద్దుకోవాలంటూ ప్రజలకు ఉచిత సలహా కూడా ఓకటి పడేశాడు.రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు మరో అడుగు ముందుకేసి పాలేరులో తనను ఓడించినట్లు లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మంలో తెరాస అభ్యర్థి నామా నాగేశ్వరరావును ఓడిస్తే మిమ్మల్ని కుక్కలు కూడా పట్టించుకోవంటూ తలబిరుసు వ్యాఖ్యలు చేశాడు.అధికారం గర్వం నెత్తికెక్కి మంత్రులు,నేతలు నోటీకి ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేయడంతో తెరాస కార్యకర్తలతో పాటు ప్రజల్లో కూడా తెరాసపై ఒకరకమైన వ్యతిరేకత, అసహ్యత మొదలైంది. ప్రజల్లో వచ్చిన మార్పును వెంటనే పసిగట్టిన తెరాస అధినేత కేసీఆర్‌ వెంటనే సదరు మంత్రులు, నేతలకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు.పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడొద్దని ప్రచారంలో ఆచితూచి మాట్లాడాలని ప్రజల్లో ఉన్నపుడు మాటలపై ధ్యాస ఉంచుతూ మాట్లాడాలంటూ గట్టిగా క్లాస్‌ పీకారట. అయినా అధికార గర్వం, అహంకారం, దర్పం తలకెక్కి నరనరాన జీర్ణించుకుపోయాక ఎన్ని వార్నింగులు ఇచ్చినా ప్రయోజనం శూన్యం.నోటి దురుసు వ్యాఖ్యలు చేయ్యొద్దంటూ నోటికి తాళం వేయించగలం కానీ మనసులో,మెదడులో పేరుకుపోయిన అధికార గర్వాన్ని, అహంకారానికి తాళం వేయించలేం కదా.ఎప్పటికైనా అది బయటపడుతుంది.అయితే ఇది ఎన్నికల సమయం కాబట్టి మంత్రుల,నేతల అసలు స్వరూపం బయట పడడానికి కొద్దిగా సమయం పడుతుందంతే..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos