రణ నీతి మారాలి

రణ నీతి మారాలి

న్యూ ఢిల్లీ : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత దేశ భద్రతా దళాలు సరికొత్త యుద్ధ నీతిని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. ‘చైనా, పాక్, అంతర్గత సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత భద్రతా దళాలు సుశిక్షితులై ఉన్నాయి. అయితే ఆ వ్యూహానికి కాలం చెల్లింది. సరి హద్దుల్లేని యుద్ధానికి మనం సిద్ధం కావాలి. ఇది గత సంప్రదాయాలను కొనసాగించాలన్న ఆలోచనకు సంబంధించినది మాత్రమే కాదు. ఒక దేశంగా మనం ఎలా ఆలో చిస్తాం, ఎలా మారతాం అనే అంశంతో ముడిపడినది’అని మంగళవారం ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. చైనా దురాక్రమణల విషయంలో ఇప్పటికే కేంద్రంపై అనేక సార్లు విమ ర్శలు గుప్పించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos