న్యూ ఢిల్లీ: కరోనా టీకా స్పుట్నిక్-వి మోతాదుల్ని దిగుమతి చేసుకోనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఇక్కడ తెలిపారు. దీని గురించి టీకా ఉత్పత్తి దార్లతో మంగళ వారం చర్చించామన్నారు. దిగుమతి చేసుకోవాల్సిన టీకా మోతాదుల గురించి ఇంకా ఖరారు కావాల్సి ఉందన్నారు. నగరంలో 620 బ్లాక్ ఫంగస్ కేసులున్నాయని, చికిత్సకు ఉపయోగించే యాంఫోటెరిసిన్-3 ఇంజక్షన్ల కొరత ఉందని తెలిపారు. మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్లు రెండూ పిల్లలకు సరిపోతాయని, వాటిని కేంద్రం సేకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.