
అహ్మదాబాద్: గుజరాత్, గాంధీ నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ్ దిగిన భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సింగ్ వాఘేలా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా గాంధీనగర్ నుంచి పోటీ చేస్తూ గెలిచిన కురు వృద్ధుడు అద్వానీని తప్పించి అమిత్ షా రంగంలోకి దిగారు. భారతీయ జనసంఘ్‌తో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన శంకర్‌సింగ్ వాఘేలా 1996లో భాజపాలో చేరారు. అనంతరం సొంత పార్టీని ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 2017లో జనవికల్ప్ మోర్చా అనే మరో కొత్త పార్టీని స్థాపించారు.