విజయవాడ వీధుల్లోకి నీళ్లు

విజయవాడ వీధుల్లోకి నీళ్లు

విజయవాడ : ముంచెత్తిన వరదలు కాస్త తగ్గుముఖం పడుతుండగానే గురువారం మరోసారి భారీ వర్షం కురిసింది. దీంతో బుడమేరుకు వరద తాకిడి పెరుగుతోంది. విజయ వాడ వీధుల్లోకి మరోసారి నీళ్లు చేరుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని జనం ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్నారు. బుడమేరు వాగుకు పలుచోట్ల గండ్లు పడడంతో విజయవాడలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇటీవలి వర్షాలకు ఇప్పటికే బెజవాడను వరద ముంచెత్తింది. కాలనీల్లో చేరిన నీరు తగ్గుతోంది. తాజాగా కురిసిన వర్షానికి నగరంలోని పలు కాలనీల్లోకి మరోమారు వరద వచ్చి చేరుతోంది. మరోవైపు, బుడమేరు వాగుకు పడిన గండ్లను పూడ్చేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమి స్తున్నారు. అయితే, ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఈ పనులకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెప్పారు. గత నాలుగు రోజుల పాటు తిండి, నీరు లేక అవస్థ పడిన జనం.. మరోసారి ఆ కష్టాలను ఎదుర్కోలేమని ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos