న్యాయం చేయాలని ఉడా రైతుల నిరసన

న్యాయం చేయాలని ఉడా రైతుల నిరసన

విశాఖ : వేపగుంటలో ఉన్న ఉడా వివాదాస్పద భూముల్లో స్థానిక రైతులు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ  సుమారు 50 సంవత్సరాలుగా ఈ భూమి సమస్య పరిష్కారం కావడం లేదని వాపోయారు. మా స్థలంలో మేము మొక్కలు వేస్తే.. ఉడా వారు వచ్చి మొక్కలను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో మా తాతలుకు వాళ్ళుకు ఏదో అగ్రిమెంట్‌ జరిగిందని చెప్తున్నారని.. కానీ మాకు అయితే ఎటువంటి నష్టపరహారం రాలేదన్నారు. ఇక్కడ ఈ సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్న కానీ ఇక్కడ అభివృద్ధి జరగలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే అధికారులు చొరవ తీసుకొని సమస్య పరిష్కారం చూపాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos