అమరావతి : శాసన సభ సమావేశాలకు తెదేపా నేతలు నల్లచొక్కాలతో హాజరైనందుకు వైకాపా నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఎద్దేవా చేసారు. ‘నల్ల ధనం మీద విచారణ వద్దని నల్ల చొక్కా వేసుకున్నావా? నాయుడూ వాటే కలర్సెన్స్!’అని అవహేళన చేసారు. ప్రభుత్వ తీరుకి నిరసనగా తెదేపా ఎమ్మెల్యేలు, నేతలు నల్లచొక్కాలు వేసుకుని పలు ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు.