ప్రత్యేక హోదా ఇప్పుడు మాత్రమే సాధ్యం

ప్రత్యేక హోదా ఇప్పుడు మాత్రమే సాధ్యం

విజయవాడ: దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇప్పుడు మాత్రమే సాధ్యమని వైసీపీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిజంగా స్పెషల్ స్టేటస్ తేవాలని అనుకుంటే ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడం, ఆ కూటమి మొత్తం టీడీపీ మద్దతుపై ఆధారపడడం కలిసి వచ్చే అంశమని చెప్పారు. అధికార కూటమిలో సభ్యుడిగా బీజేపీ నేతలను సులభంగా కలిసేందుకు చంద్రబాబుకు వీలు కలుగుతుందని అన్నారు.ఈమేరకు విజయసాయి రెడ్డి సోమవారం ట్వీట్ చేశారు. నిజంగా చంద్రబాబు సంకల్పిస్తే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం కాదని అన్నారు. దీనికి కావాల్సిందల్లా నిజమైన సంకల్పం మాత్రమేనని వివరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడిగి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని సీఎం చంద్రబాబుకు సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos