విశాఖ ఉక్కు అమ్మకాన్ని నిరసిస్తాం

విశాఖ  ఉక్కు అమ్మకాన్ని నిరసిస్తాం

అమరావతి : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అయిన కాటికి అమ్మేకుండా గళమెత్తుతామని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలి పారు. వైకాపా పార్లమెంటు సభ్యులతో గురువారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురువారం సమావేశ మయ్యారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం విజయసాయి రెడ్డి విలేఖరులతో మాట్లాడారు. ‘రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మావాణిని వినిపిం చేందుకు సిద్ధంగా ఉన్నాం. పోలవరం జలాశయ నిర్మాణానికి నిధుల కొతర అంశాన్ని లేవనెత్తుతాం.ఎంతో మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవే టీకకరణకు వ్యతిరేకంగా గళం వినిపిస్తాం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం తలెత్తినందున కృష్ణా నది యాజమాన్య బోర్డు (కెఆర్ఎంబి) పరిమితిని ప్రకటించా ల్సిందిగా కేంద్రాన్ని కోరుతాం. ఇంకా తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టుల గురించి పార్లమెంట్లో ప్రస్తావిస్తామ’ని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos