హీరోలో వీఆర్ఎస్

  • In Money
  • September 17, 2019
  • 175 Views
హీరోలో వీఆర్ఎస్

ముంబై : ఆర్థిక మందగమనం ప్రభావం ఒక్కో రంగంపైనే పడుతోంది. అమ్మకాలు పడిపోవడంతో మొన్నటి దాకా కార్లకే  పరిమితమైన లేఆఫ్‌లు, పరిమిత ఉత్పత్తి లాంటి పరిణామాలు ఇతర రంగాలకూ విస్తరిస్తున్నాయి. మోటారు సైకిళ్ల తయారీ రంగంలోని హీరో మోటో కార్ప్స్‌ తన ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకాన్ని ప్రకటించింది. నలభై ఏళ్లు పైబడిన వారు, అయిదేళ్లకు పైగా పని చేస్తున్న వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగులకు మిగిలిన ఉన్న సర్వీసు కాలాన్ని బట్టి పరిహారం అందజేయనున్నారు. వారి పిల్లలకు భవిష్యత్తులో ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కూడా కల్పిస్తారు. వీఆర్‌ఎస్‌తో పాటు అదనపు బహుమతులు, వైద్య సదుపాయాలు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, కార్ల కొనుగోళ్లపై రాయితీలు లాంటి సదుపాయాలను కూడా కల్పించనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos