1.41 లక్షల నకిలీ వోటర్ల తొలగింపు

అమరావతి: ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపునకు అందిన ధరఖాస్తుల్లో ఎనభై ఐదు శాతం నకిలీవని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం శనివారం ఇక్కడ ప్రకటించింది. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు 9.5 లక్షల దరఖాస్తులు అందగా 1.41 లక్షల దరఖాస్తుల్ని మాత్రమే ఆమోదించి ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించినట్లు వివరించింది. జిల్లాల వారీగా శ్రీకాకుళం- 2,579, విజయనగరం- 5,166, విశాఖ- 2,407, పశ్చిమగోదావరి 8,669, ప్రకాశం- 6,040, నెల్లూరు- 3,850, కడప- 5,292, కర్నూలు- 7,684, అనంతపురం- 6,516, గుంటూరు- 35,063, తూ.గో- 24,190, కృష్ణా- 19,774, చిత్తూరు- 14,052 నకిలీ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos