ఉక్కు కర్మాగారం వద్ద తీవ్ర ఉద్రిక్తత

ఉక్కు కర్మాగారం వద్ద తీవ్ర ఉద్రిక్తత

విశాఖ :ఇక్కడి ఉక్కు కర్మాగారం వద్ద మంగళవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ‘ఉక్కు ఫ్యాక్టరీలో మీకు నయాపైసా వాటా లేదు. మొత్తం అమ్మేస్తాం ‘ అన్న కేంద్రం ప్రకటన ఉత్తరాంధ్ర ప్రజల రక్తాన్ని ఉడికించింది. 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న పరిశ్రమను ఆంధ్రుల హక్కుగా భావిస్తుంటే.. ప్రయివేటీకరణ అనే ఒక్క పదంతో మీకు సంబంధం లేదనడంతో, తెలుగు ప్రజలు మండిపడుతున్నారు. పరిశ్రమల కోసం వేల ఎకరాల భూముల్ని త్యాగం చేస్తే, ఇప్పుడు నడిరోడ్డున పడేస్తే ఊరుకుంటామా ? అని ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. నిరసనల జ్వాలలతో విశాఖ తీరం హోరెత్తింది. స్టీల్ ప్లాంట్ పరిపాలన కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. ఫైనాన్స్ డైరెక్టర్ వేణుగోపాల్ను వాహనాన్ని చుట్టు ముట్టారు. లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వేణుగోపాల్ చుట్టూ వలయంగా ఏర్పడి బయటకు తెచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికుల ఆందోళన ఉధృతంగా కొనసాగుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos