కోల్ తక్షణం విడుదల చేయాలి

కోల్ తక్షణం విడుదల చేయాలి

గంగవరం: గంగవరం పోర్టు యాజమాన్యం” స్టీల్ ప్లాంట్ కోల్” తక్షణం విడుదల చేయాలని స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో గంగవరం పోర్టు గేటు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున గంగవరం యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు నినదించారు. ఈ ధర్నాను ఉద్దేశించి జె అయోధ్యరామ్ మాట్లాడుతూ విదేశాల నుండి కొనుగోలు చేసిన కోల్ గంగవరం పోర్ట్ కు చేరుకుంటే అది స్టీల్ ప్లాంట్ కి చేరకుండా అదానీ యాజమాన్యం అడ్డుకుంటున్నదని ఆయన తీవ్రంగా విమర్శించారు. అనేక వేల కోట్లతో కొన్న కోల్ పై వారికి రావలసిన అతి చిన్న మొత్తాన్ని పొందడం కోసం కోర్టులను ఆశ్రయించి వాటిపై స్టే లను తెచ్చి అడ్డుకుంటుందని ఆయన వివరించారు. గత పాలకుల అనాలోచిత నిర్ణయాల ద్వారా గంగవరం పోర్ట్ ప్రైవేటు వారికి కట్టబెట్టారని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ భూముల్లో నిర్మించిన గంగవరం పోర్టు యాజమాన్యం స్టీల్ ప్లాంట్ తో వ్యాపారం చేస్తూ దీనికి నష్టాలు కలిగించాలని అనుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. కనుక తక్షణం స్టీల్ ప్లాంట్ కోల్ ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామి మాట్లాడుతూ ఈ కోల్ ద్వారా ఉత్పత్తి అయ్యే “కార్బన్ మోనాక్సైడ్”(సి ఓ) గ్యాస్ ద్వారా బ్లాస్ట్ ఫర్నిస్, స్టీల్ మెల్టింగ్ షాప్, మిల్స్ వంటి తదితర విభాగాల ఉత్పత్తికి ఈ గ్యాస్ ని వినియోగిస్తారని ఆయన వివరించారు. ఈ గ్యాస్ లేని పక్షంలో స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయి ఉత్పత్తిపై పడి యంత్రాలు మరమ్మత్తుకు గురి అవుతాయని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి విఘాతం కలిగించే గంగవరం పోర్ట్ యాజమాన్యం వైఖరిని మార్చుకొని, ఉత్పత్తికి అవసరమైన కోల్ ను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటి దాస్ మాట్లాడుతూ స్టీల్ మంత్రి గారు ఇక్కడకు విచ్చేసి దీనిని పూర్తిస్థాయి ఉత్పత్తికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తానని చెప్పిన మాటలు నీటి మీద రాతలు లా ఉన్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. మంత్రిగారు రాక మునుపు వరకు 12 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తుంటే నేడు అది 4 మిలియన్ టన్నులకు పడిపోయిందని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ లో విస్ఫోటనం జరిగితే ఆ ప్రమాదాన్ని అంచనా వేయడానికి కూడా ఎవరికి సాధ్యం కాదని ఆయన అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సమస్య తీవ్రతను పాలకుల దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.
స్టీల్ సిఐటియు సీనియర్ నాయకులు ఎన్ రామారావు మాట్లాడుతూ ఈ ప్లాంట్ ను కాపాడుకోవడం కార్మికులకు ఒక్కరికే కాదని ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని ఆయన అన్నారు. అందులో భాగంగానే ఈనెల 10 వ తారీఖున జరిగే రాస్తారోకోల్లో పెద్ద ఎత్తున ప్రజలు కూడా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos