వివేకా ‘ కేసు’ : తీర్పు వాయిదా

అమరావతి: మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైకాపా నేతలు దాఖలు చేసిన వ్యాజ్యంపై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది.వైఎస్. వివేకానందరెడ్డి ఈ నెల 14 రాత్రి పులి వెందుల లోని సొంత నివాసంలో హత్యకు గురయ్యాడు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్కు బదులుగా సీబీఐతో దర్యాప్తు చేయించాలని హతుడు వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, అన్న కొడుకు, వైకాపా అధ్యక్షుడు జగన్‌ దాఖలు చేసిన వ్యాజ్యాలపై అన్నివర్గాల వాదనలను విన్నఉన్నత న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos