పులివెందుల: వైఎస్ వివేకానందరెడ్డి మృతి పై కుటుంబ సభ్యులు అనుమానించినట్లు వైకాపా ప్రముఖుడు విజయ సాయిరెడ్డి తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసి, లోతుగా దర్యాప్తు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. శవ పరీక్షలో వాస్తవాలు వెలుగు చూస్తాయని ఆశించారు. తన పెదనాన్న మృతిపై అనుమానాలు కలుగుతున్నాయని లోక్‌సభ మాజీ సభ్యుడు వై.ఎస్. అవినాష్ రెడ్డి వ్యాఖ్యా నించారు. దాడికి గురై మృతి చెందినట్లు అనిపిస్తోందని, తల ముందు వెనుక గాయాలు, చేతులకు గాట్లు పడ్డాయని చెప్పారు. వివేకానందరెడ్డి మృతి పై నిష్పాక్షిక దర్యాప్తునకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివేకానంద రెడ్డి వ్యక్తి గత సహాయకుడు దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం ఆయనది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జాగాలాల దళాన్ని కూడా రంగంలోకి దింపామన్నారు. స్నానాల గదిలో రక్తపు మరకల్ని గుర్తించామని పోలీసు సూపరెంటెండెంట్ తెలిపారు.