1000 మంది చైనీయుల వీసాల రద్దు

1000 మంది చైనీయుల వీసాల రద్దు

వాషింగ్టన్: జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా దాదాపు వేయి మందికి పైగా చైనా విద్యార్థులు, పరిశోధకుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. వీరు అమెరికాకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చైనా సైన్యానికి చేరవేస్తున్నారనే అనుమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. బానిసలు, వెట్టిచాకిరీతో ఉత్పత్తి చేసిన వస్తువులు తమ దేశంలోకి అడ్డుకుంటామనీ ప్రకటిచింది. జిన్జియాంగ్లోని ఉయిగుర్ ముస్లింల పట్ల చైనా దాష్టీకాన్ని తీవ్రంగా ఖండించింది. వీసాల రద్దుపై హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికార ప్రతినిధి చాద్ వాఫ్ విలేఖరులకు వివరించారు. కొందరు చైనీయులు కరోనా వైరస్ పరిశోధన సమాచారాన్ని తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అమెరికా విద్యా విధానాన్ని కించపరస్తున్నారనీ మండిపడ్డారు. అమెరికాలో దాదాపు 3.60 లక్షల మంది చైనీయులు విద్యనభ్యసిస్తున్నారు. వీరి వల్ల అక్కడి కాలేజీలకు పెద్ద మొత్తంలో ఆదాయం చేకూరుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos