వెస్ట్‌ నైల్‌ వైరస్‌కు బాలుడి మృతి

తిరువనంతపురం:  వెస్ట్‌ నైల్‌ వైరస్‌ బారినపడి మలప్పురం జిల్లాకు చెందిన ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. కోజికోడ్‌ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న ఆ బాలుణ్ని  వెస్ట్‌ నైల్‌ వైరస్‌ పీడిస్తు న్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది.దరిమిలా అతనికి మెరుగైన చికిత్స అందించేందుకు  ఎన్‌సీడీసీ ప్రత్యేక వైద్యుల బృందం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించక పోవటంతో  సోమవారం ఉదయం మృతి చెందారు. వెస్ట్‌ నైల్‌  వైరస్‌ వ్యాప్తించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని మలప్పురం జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఉత్తర మలబార్‌ తాన్ని అప్రమత్తం చేసారు. ఇతరులకు ఈ వ్యాధి సోకినట్లు   కేసులు నమోదు కాలేదు. నిరుడు నిఫా వైరస్‌ వల్ల  చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితులకు వైద్యంచేసిన వారిలో కొందరు కూడా  ఆ వ్యాధి బారిన పడి మృతి చెందటం ఇక్కడ ప్రస్తావ నార్హం. 1937లో యుగాండాలో ఈ వైరస్‌ తొలి సారి కనిపించింది. దోమల ద్వారా ఇది వ్యాప్తిస్తుంది. ఈ వైరస్‌కు గురయిన వారికి  జ్వరం, తలనొప్పి, వాంతులు, ఒళ్లు నొప్పులు, కొన్ని సందర్భాల్లో దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్‌ నివారణకు మందులు లేవు. దోమలకు దూరంగా ఉండటం వల్లే వ్యాధికి గురి కాకుండా తప్పించుకోవచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos