హైదరాబాదు : రానా కథానాయకుడిగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన –విరాటపర్వం త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. తొమ్మిదో దశకంలో నక్సలైట్ల జీవిన విధానం, ఆశయ సాధనలో వాళ్లు ఎదుర్కున్న ఇబ్బదులు, అలాగే కుటుంబ జీవనానికి దూరమైన వాళ్లలో కలిగే భావోద్వేగాలు ఇతి వృత్తంగా సినిమాను తీసారు. సాయి పల్లవి కథనాయిక. సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాను, గత ఏప్రిల్ 30న విడుదల దలచారు. కరోనా కారణంగా వాయిదా పడింది. ఓటీటీలో విడుదల చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. థియేటరలకు, శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్, హక్కులను గతంలో అమ్మేశారట. దరిమిలా విడుదల తేదీని త్వరలో ప్ర్రకటించనున్నారు.