వచ్చే ఐపీఎల్‌లో బలమైన జట్టును చూస్తారు..

  • In Sports
  • December 18, 2019
  • 169 Views

ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ ఉన్న లీగ్‌లలో ఒకటైన ఐపీఎల్‌లో ఎప్పుడూ ప్రత్యేకంగా నిలిచే ఆర్‌సీబీ జట్టు.దేశవ్యాప్తంగా ఆర్‌సీబీకి అభిమానులు ఉన్నారు.ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవకపోయినా ప్రతిసారి టైటిల్‌ ఫేవరెట్‌గానే ఆర్‌సీబీ బరిలో దిగుతుంది.ఈ నేపథ్యంలో ఆర్‌సీబీ సారథి విరాట్‌ కొహ్లీ ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు సందేశం పోస్టు చేశాడు. ‘బెంగళూరు అభిమానులకు హాయ్. ఇన్ని సంవత్సరాలుగా మీరు మమల్ని ఎంతో ఆదరించారు. ఇకపై కూడా ఇదే అభిమానాన్ని చూపిస్తూ.. మాకు అండగా ఉంటారని నమ్ముతున్నా. త్వరలో ఐపీఎల్‌-13 వేలం జరగనుందని అందరి తెలిసిందే. వేలంలోకి రానున్న ఆటగాళ్ల ఎంపికకు సంబంధించి మా జట్టు యాజమాన్యంతో ఇప్పటికే చర్చలు జరిపా. కోచ్‌లు మైక్‌ హస్సీ, సైమన్‌ కటిచ్‌లు తమ శక్తి మేర కష్టపడుతున్నారు’ అని తెలిపాడు. జట్టు యాజమాన్యంతో ఇప్పటికే వేలంకు సంబంధించి సంప్రదింపులు జరిపాం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం. వేలంలో అన్ని రకాలుగా నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. వచ్చే సీజన్‌లో స్ట్రాంగ్ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌ను చూడబోతున్నారు. డిసెంబర్ 19న ఏం జరుగుతుందో చూద్దాం’ అని కోహ్లీ పేర్కొన్నాడు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos