హద్దు లేకుండా పెరుగుతున్న టెక్నాలజీ గ్రామీణ స్థాయికి కూడా చేరుకోవడంతో ఇంటర్నెట్,సోషల్ మీడియా వినియోగం,ప్రభావం బాగా పెరిగింది.ప్రతి ఒక్కరు సామజిక మాధ్యమాల్లో ఖాతాలు కలిగి ఉండడంతో ప్పుడు ఏ కంటెంట్ హిట్ అవుతుందో చెప్పలేం. ఏ ఫోటో ట్రెండ్ అవుతుందో.. ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. ప్రస్తుతం వివిధ సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఒక చిన్న పిల్లాడు భాంగ్రా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడు. ఇందులో ఏముంది.. పిల్లలు భాంగ్రా చేయడం చాలా సార్లు చూశాం అంటారా.. కానీ ఈ వీడియో మాత్రం కాస్త స్పెషల్. ఈ వీడియోలో కుర్రాడు గేటు బయట నిలబడి డ్యాన్స్ చేస్తుండగా.. ఇటువైపు రెండు కుక్క పిల్లలు కనిపిస్తాయి. ముందు వాటిని చూసిన ఆగిన పిల్లాడు.. అవి అతన్ని చూడడంతో టీజింగ్ చేయడం మొదలు పెడతాడు. చేతులతో సైగలు చేస్తాడు. అక్కడితో ఆగకుండా భాంగ్రా డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తాడు.పిల్లాడి చేష్టలకు కుక్కలు సైతం అటు ఇటు కదులుతూ,గెంతుతూ పిల్లాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ కుర్రాడి ఎనర్జీని మెచ్చుకుంటున్నారు. ఈ మధ్య చూసిన ది బెస్ట్ వీడియో అంటున్నారు.అయితే మరో వైపు కొంత మంది సరదాగా రిప్లై ఇస్తున్నారు. గేటు తెరిచి ఉంటే అదే పిల్లాడు తుర్రుమని క్షణాల్లో అక్కడి నుంచి మాయం అయ్యేవాడు అని కామెంట్ చేస్తున్నారు.
🤣🤣😂😂 pic.twitter.com/0ZI7yU9MSM
— Vinesh Kataria (@VineshKataria) October 3, 2020