ముందు మీ నలుగురు పిల్లలను తెలుగు మీడియంలో చేర్పించండి..

ముందు మీ నలుగురు పిల్లలను తెలుగు మీడియంలో చేర్పించండి..

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాష, నదుల పరిరక్షణకు ఉద్యమం చేయడం కోసం కులమతాలు, రాజకీయాలకు అతీతంగామన నుడి.. మన నదియజ్ఞాన్ని ప్రారంభిస్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది సినిమా టైటిల్లా అదిరిపోయిందంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.’మన నుడి, మన నది.. సినిమా టైటిల్లాగా అదిరిపోయింది. ముందు మీ నలుగురు పిల్లలను తెలుగు మీడియంలో చేర్పించి నుడికారాన్ని మొదలు పెట్టాలి. తర్వాత మీకు ప్యాకేజి ఇచ్చే యజమాని.. కృష్ణా నదిని పూడ్చి నిర్మించిన కరకట్ట నివాసాన్ని తొలగించాలని ఆందోళన చేయాలి. అప్పుడు నదుల రక్షణ సఫలమవుతుందిఅని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos