తిరువనంత పురం : రైతు ఉద్యమానికి సంఘీ భావంగా నిలుస్తామని ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ప్రకటించారు బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘రైతు ఉద్యమానికి రోజురోజుకీ మద్దతు పెరుగుతోంది. రైతుల న్యాయమైన డిమాండ్ల ప్రకారం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. నూతన చట్టాలకూ, కేరళకు సంబంధమేందని చాలా మంది అడుగుతున్నారు .ఆహార కొరత దేశంలో తలెత్తితే అది అత్యధిక వినియోగదారుల రాష్ట్రమైన కేరళపైనే ప్రభావం పడుతుంది. అందుకే కేరళలో నిరసన తెలుపుతున్నామ’ని వివరించారు.