కేసీఆర్‌ చక్రం తిప్పుతుంటే జగన్‌ చూస్తూ ఉంటారా?

కేసీఆర్‌ చక్రం తిప్పుతుంటే జగన్‌ చూస్తూ ఉంటారా?

లోక్‌సభ ఎన్నికలకు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలు వ్యూహాలు,ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అత్యధిక స్థానాల్లో వీలైతే క్లీన్‌స్వీప్‌ చేయాలని తెలంగాణలో తెరాస,కాంగ్రెస్‌లు ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా,వైసీపీలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు.లోక్‌సభతో పాటు శాసనసభకు కూడా ఎన్నికలు జరుగనుండడంతో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి కొంచెం ఎక్కువగా ఉంది.లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 16 ఎంపీ సీట్లలో తెరాస అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామంటూ తెరాస అధినేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మహిళ నేత విజయశాంతి స్పందించారు.16 సీట్లు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో 22 సీట్లు గెలుస్తానంటున్న వైసీపీ అధినేత జగన్‌ చూస్తూ ఊరుకుంటారా అంటూ విజయశాంతి ప్రశ్నించారు.16 సీట్లున్న తెరాస కేంద్రాన్ని శాసిస్తే 25 అంతకు మించి ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రాలు 20కి పైగా ఎంపీ స్థానాలు గెలిచే మిగిలిన పార్టీలు కేసీఆర్‌కు సలామ్‌ అంటాయా అని ప్రశ్నించారు.16 సీట్లు గెలిచే కేసీఆర్‌ కేంద్రంలో చక్రం తిప్పుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో 22 సీట్లు సాధిస్తానంటున్న జగన్‌ ఎలా ఊరుకుంటారని ప్రశ్నించారు. ఒకవేళ జగన్‌తో అవగాహనకు వచ్చినా 40కి పైగా సీట్లు సాధిస్తామంటున్న మాయావతి,మమత బెనర్జీలు కేసీఆర్‌ చెప్పుచేతల్లో ఎందుకు ఉంటారని ప్రశ్నించారు.ఇక తాము ఏర్పాటు చేస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌లో వైసీపీ అధినేత జగన్‌ కూడా చేరతాని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు.ఇదే వ్యాఖ్యలను ఆయుధంగా మలుచుకొని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేయాలని చూస్తున్న కేసీఆర్‌తో జగన్‌ పొత్తు పెట్టుకున్నారంటూ ఆరోపణలు చేశారు. తెలంగాణలో అధికార పార్టీ నేతలు జగన్‌కు సానుకూలంగా చేస్తున్న ప్రతీ వ్యాఖ్యలను చంద్రబాబు తనకు అనుకూలంగా మలుచుకుంటూ జగన్‌పై విమర్శలదాడి చేస్తున్నారు.అయితే తెరాసతో తమకు మైత్రి లేదని హోదా కోసం మద్దతిస్తే స్వీకరిస్తామని వైసీపీ అధినేత జగన్‌ స్పష్టం చేశారు.తెలంగాణలో తెరాస సాధించే 16 ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సాధించే 25 ఎంపీ సీట్లు మొత్తం 42 ఎంపీలతో కలసి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేస్తామంటూ జగన్‌ తెలిపారు.తాజాగా విజయశాంతి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీశాయి.దీనిపై తెరాస నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos