
కందుకూరు: తన మరిది, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐచే దర్యాప్తు జరిపించేందుకు భయపడుతున్నారో చెప్పాలని వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం ఇక్కడ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగిన వైకాపా ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. అందరి సంక్షేమం, అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్నారు.ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు, అర్హత లేదని అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ పాలనను గుర్తు చేసుకోవాలని కోరారు.