
ప్రతిపక్ష వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఏదైనా అంశంపై
విమర్శలు లేదా మాట్లాడడానికి ముందుకు వచ్చారంటే అధికార తెలుగుదేశం పార్టీలో కొద్దిపాటి
వణుకు ఉంటుంది.చాలా లాజికల్‌గా,కొత్త పంథాలో విమర్శలు గుప్పించే విజయసాయిరెడ్డికి సమాధానం
చెప్పడానికి అధికార తెదేపా నేతలు ఆపసోపాలు పడుతుంటారు.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
దక్కాల్సిన ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట మార్చిన తీరును ప్రశ్నిస్తూ… చంద్రబాబుకు యూటర్న్ అంకుల్ అంటూ సరికొత్త పేరు పెట్టి
విజయసాయిరెడ్డి… టీడీపీని ఇరకాటంలోకి నెట్టేశారు. ఈ తరహా కొత్త ఆరోపణలతో నిత్యం ట్విట్టర్ వేదికగా విరుచుకుపడుతున్న విజయసాయిరెడ్డి… తన తాజా ట్వీట్ లో టీడీపీ సర్కారుకు ఓ సవాల్ విసిరారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేసుకోవాలనంటూ
ప్రభుత్వానికి సవాల్ విసిరారు.రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై
చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదని – మార్ఫింగ్ వీడియోలతో వైసీపీ నేతలు కుట్రలు చేశారని టీడీపీ సర్కారు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది. వారిలో ఒకరి అరెస్ట్ చాలా చిత్రంగా జరిగింది. పెళ్లైన మరునాడే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పెద్ద చర్చకే తెర తీశారు. ఈ అరెస్ట్ లపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. చింతమనేని దళితులను దూషిస్తున్నట్లుగా ఉన్న వీడియోను
తాను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నానని – దమ్ముంటే తనను అరెస్ట్ చేసుకోవాలని ఆయన చంద్రబాబు సర్కారుకు సవాల్ విసిరారు. విజయసాయిరెడ్డి ట్వీట్ ఒకసారి
పరిశీలిస్తే… *ట్వీట్లు – ఫేస్ బుక్ సాకుగా అరెస్ట్ లు చేయొద్దంటూ 2015లోసుప్రీంకోర్టు తీర్పు కూడా తెలియని మీరేం ఐటీ మంత్రి లోకేషూ!ఆ రూలు వర్తింప చేస్తే మీ ట్వీట్లకు రోజుకు ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి?మీ డాడీ షాడో నుంచి బైటకు రా. చింతమనేని దళితులను దూషించే వీడియో పోస్ట్ చేస్తున్నాను. చర్యలు తీసుకోండి* అంటూ ఆయన చంద్రబాబు సర్కారుకు గట్టి సవాలే విసిరారు. మరి విజయసాయి
రెడ్డి విసినిర సవాల్‌కు అధికార తెదేపా నుంచి ఇప్పటివరకు సమాధానం రాకపోవడం గమనార్హం..