మిగిలిన హీరోల కంటే యువత తననే ఎక్కువగా ఎందుకు అభిమానిస్తున్నారో యువ సంచలనం,తెలుగు చిత్రపతరిశ్రమ రౌడీ విజయ్ దేవరకొండ మరోసారి నిరూపించుకున్నారు.గురువారం పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీరసైనికుల ఆత్మకు శాంతి చేకూరలని,జవాన్ల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నామని ఇంకా ఏవేవో కేవలం సామాజిక మాధ్యమాలకు మాత్రమే పరిమితయ్యేలా అన్ని చిత్రపరిశ్రమల హీరోహీరోయిన్లు పోస్ట్‌లు చేసారు. అమరులైన వీరసైనికుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెడితే చాలదని మన కోసం ప్రాణాలు అర్పించిన సైనికులు కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని తెలియజేస్తూ అమరులైన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించి విజయ్ దేవరకొండ తన ప్రత్యేకత,పెద్ద మనసు చాటుకున్నారు.విజయ్ దేవరకొండ ఆర్థిక సహాయం ప్రకటించడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన విజయ్ దేవరకొండ చిన్నా చితకా వేషాలతో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎంత ఎదిగినా తన మూలాల్ని మరిచిపోని తత్వం అతన్ని అందరికంటే భిన్నంగా ఆలోచించేలా చేస్తోందని పలువురు విజయ్ గొప్ప మనసుకు ఫిదా అయిపోతున్నారు.దీంతోపాటు “వారు మన కుటుంబాల్ని రక్షిస్తున్నారు. ఈ కష్టకాలంలో మనం వారి కుటుంబాలకు అండగా నిలవాలి. సైనికుల జీవితాలను సాయంతో వెలకట్టలేము. కానీ దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న వారికి మనం మన వంతు సహకారం అందించాలి. అందుకే నా వంతు సహకారం అందించా. మనందరం కలిసి సాయం చేద్దాం. మనమంతా కలిసి వారికో పెద్ద మద్దతును క్రియేట్ చేద్దాం“ అంటూ సోషల్ మీడియా ట్విట్టర్ లో విజయ్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. హ్యాట్సాఫ్ టు విజయ్ అని యూత్ పొగిడేస్తున్నారు.