నీట్‌పై ప్రజలు విశ్వాసం కోల్పోయారు

నీట్‌పై ప్రజలు విశ్వాసం కోల్పోయారు

చెన్నై: ప్రజలు నీట్పై విశ్వాసం కోల్పోయారని తమిళ స్టార్ దళపతి విజయ్ వ్యాఖ్యానించారు. ఈ సమస్యకు పరిష్కారంగా రాజ్యాంగాన్ని సవరించాలని కోరారు. ఇక్కడ జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘నీట్ పరీక్షపై ప్రజలకు నమ్మకం పోయింది. దేశానికి నీట్ అవసరం లేదు. నీట్ నుంచి మినహాయింపు ఒక్కటే పరిష్కారం. రాష్ట్ర అసెంబ్లీలో నీట్కి వ్యతిరేకంగా ఆమోదించిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నాను. తమిళనాడు ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. విద్యను సమ్మిళిత జాబితా నుండి రాష్ట్ర జాబితా కిందకు తీసుకురావాలి. నీట్ పరీక్ష కారణంగా తమిళనాడులో పెద్ద సంఖ్యలో పేద, అర్హులైన, అట్టడుగున ఉన్న విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించలేకపోతున్నారు’ అని విజయ్ అన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రత్యేక ఉమ్మడి జాబితాను రూపొందించడానికి రాజ్యాంగాన్ని సవరించాలని అభిప్రాయపడ్డారు. ఇందులో విద్య, ఆరోగ్యాన్ని కూడా జోడించాలన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos