బకాయిలు తీర్చేస్తా. కేసులు కొట్టేయండి

బకాయిలు తీర్చేస్తా. కేసులు కొట్టేయండి

న్యూ ఢిల్లీ : భారతీయ బ్యాంకు బకాయిల్ని పూర్తిగా చెల్లించేందుకు అవకాశాన్ని కల్పించాలని ఆర్థిక నేరగాడు విజయ మల్య మరో సారి కేంద్రాన్ని కోరారు. ప్రభుత్వం ప్రజలకు భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించినందుకు అభినందించారు. తన విన్నపాన్ని ప్రభుత్వం విస్మరిస్తుందని వాపోయారు. ‘కరోనా రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రానికి నా అభినందనలు. వారు కావాలంటే ఎన్ని నోట్లు అయినా ముద్రించగలరు. కానీ ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న100 శాతం రుణ బకాయిలు చెల్లిస్తానన్న నా అభ్యర్థనను ప్రతిసారి విస్మరించాలా? నా డబ్బు తీసుకొని నా మీద ఉన్న కేసు కొట్టేయండి’ అని ట్వీట్ చేసారు. ఆయన వివిధ బ్యాంకుకు రూ.9000 కోట్ల బకాయిల్ని చెల్లించాల్సి ఉంది. 2016 విదేశాలకు పారిపోయారు. ప్రస్తుతం లండన్లో ఉన్న ఆయన్ను తిరిగి ఇక్కడకు రప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos