హిందీతో పటు తెలుగు,తమిళ చిత్ర పరిశ్రమల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు విద్యుత్ జమాల్ చిత్ర పరిశ్రమల్లో వారసత్వం,బంధుప్రీతిపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.’మేం చేసే పనికి ప్రజలు మాపై ప్రేమ కురిపిస్తారు. కానీ సినీ ఇండస్ట్రీ వ్యక్తులే మమ్మల్ని గుర్తించరు. కనీసం ఓ ట్వీట్ కూడా చేయరు. ఇలాంటివి నన్ను పెద్దగా బాధించవు. అన్నింటికి సిద్ధమయ్యే నేను ఇక్కడికి వచ్చాను. ఒక మార్గం మూసుకుపోతే వంద మార్గాలు తెరుచుకుంటాయి. నా జర్నీలో నేను తెలుసుకున్నది ఇదే. మనల్ని ఎవరు ఆపలేరు” అని విద్యుత్ అన్నారు.