హొసూరు : ఇక్కడికి సమీపంలోని బాగలూరు పంచాయతీ ఉపాధ్యక్షుడుగా శ్రీనివాస రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు గత నెలలో జరుగగా, ఈ నెల 2న ఓట్ల లెక్కింపు చేపట్టారు. హొసూరు ప్రాంతంలో పంచాయతీ ఉపాధ్యక్ష పదవులకు శనివారం ఎన్నికలు నిర్వహించారు. బాగలూరు పంచాయతీ అధ్యక్షుడుగా వీడీ. జయరాం గెలుపొందగా, నేడు జరిగిన ఉపాధ్యక్ష ఎన్నికలలో జీ.మంగళం గ్రామానికి చెందిన శ్రీనివాస రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏడీఎంకే ప్రముఖులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు శ్రీనివాస రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఉపాధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని అన్నారు. తనను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని ఆయన తెలిపారు.